TG: కామారెడ్డి జిల్లాలోని సింగరాయపల్లిలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదోవ తరగతి చదువుతున్న శ్రీనిధి అనే విద్యార్ధిని పాఠశాలకు వెళ్తుండగా గుండెపోటు రావడంతో కళ్లు తిరిగి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా ..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శ్రీనిధి మృతితో సింగరాయపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.