డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డా. టీ. రామ్మోహన్ రెడ్డి గురువారం జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని కార్యకర్తలు తెలిపారు. ఉదయం. 11: 00 గంటలకు వికారాబాద్ పట్టణంలోని కలెక్టరేట్లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం 1: 00 గంటలకు పరిగిలోని KAR ఫంక్షన్ హాల్ లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.