కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఎమ్ గ్రూపులలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్స్ తీసుకోనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 16 నుండి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 28న అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.