షాద్ నగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వేను కొత్తూరు మున్సిపాలిటీ కుమ్మరిగూడలో నిర్వహించారు. ఈ సర్వేలో ఎన్యుమరేటర్, అధికారులతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వివరాలను సేకరించారు. కులగణనపై అధికారులకు ప్రజలు సమగ్ర వివరాలు ఇవ్వాలని తెలిపారు.