మేడ్చల్: సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సింగరేణి లో ఈ నెల 28 న జరిగే స్ట్రక్చర్ సమావేశంలో రిటైర్డ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి గుర్తింపు సంఘం ఏఐటీయుసి పరిష్కారం కోసం కృషి చేయాలని శనివారం సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామం సుప్రభాత్ టౌన్ షిప్ లో అసోసియేషన్ నాయకులు దండంరాజు రాంచందర్ రావు అధ్యక్షతన అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది.