మేడ్చల్: యువతి పరిస్థితి విషమం.. మల్లారెడ్డి ఆస్పత్రిలో ఆందోళన
మేడ్చల్: మల్లారెడ్డి ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి యువతి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ కోసం వచ్చిన మాధవి (28)కి డాక్టర్లు చికిత్స అందించారు. అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో కోమాలోకి వెళ్లిందని, యువతి ప్రాణాపాయ స్థితిలో ఉందని బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయిస్తున్నారు.