గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లింపులు చేయాలని కోరుతూ రాష్ట్ర సచివాలయం ముందు చేపట్టే నిరసన కార్యక్రమానికి శుక్రవారం ఉదయం హైదరాబాద్ వెళ్తున్న పలువురు మాజీ సర్పంచులను దోమ మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు కె. రాజిరెడ్డి, దాదాపుర్ సర్పంచ్ కృష్ణ, మల్లేపల్లి సర్పంచు అంజలయ్యను బయలుదేరే సమయంలో పోలీసులు అడ్డుకొన్నారు.