'పెద్దవార్వాల్' లో ఘనంగా బీరప్ప ఉత్సవాలు

82చూసినవారు
గండీడ్ మండల పరిధిలోని పెద్దవార్వాల్ గ్రామంలో బీరప్ప జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కురుమ యాదవులు ఉదయం నుంచే బీరప్ప ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి ఒకరిపై ఒకరు బండారు చల్లుకొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు వెంకట్ యాదవ్, వెంకటేష్ గౌడ్, యాదవ్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్