విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం సుమారు 400 మీటర్లు వెనక్కి వెళ్ళింది. శనివారం సాయంత్రం సముద్రం వెనక్కి వెళ్లడంతో తీరంలో భారీగా రాళ్లు బయటపడ్డాయి. వాటిపైకి చేరి ఫొటోలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ విశాఖలో సముద్రం వెనక్కి వెళ్లింది. అయితే సముద్ర కదలికలు గమనించి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.