తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న సమావేశంలో శనివారం పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి తొడగొట్టారు. ప్రతిపక్షాలు పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం అని అంటున్నారని, ప్రభుత్వాన్ని పడగొడితే ఊరుకునేది లేదన్నారు. వారు ప్రభుత్వాన్ని పడగొతామంటే, తాము తొడ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ తొడగొట్టి చూపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.