ప్రభుత్వ మోడల్ స్కూళ్లో చేరేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తాండూరు మండలం జినుగుర్తి సమీపంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వై. ప్రకాష్ తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం 2024-25కు గాను 6వ తరగతిలో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఇందుకు వచ్చే నెల 22వ తేది వరకు గడువు ఉందన్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తి చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.