బిజెపిలోకి మాజీ సర్పంచ్

57చూసినవారు
వికారాబాద్ మండలం పెండ్లమడుగు గ్రామ మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి టిఆర్ఎస్ పార్టీని వీడారు. శనివారం 50 మంది అనుచరులతో కలిసి ఆయన బిజెపి వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. వికారాబాద్ బిజెపి ఎన్నికల ఇంచార్జ్ విశ్వజిత్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్