వికారాబాద్
గంగాసాగర్ లో పాముకాటుతో చిన్నారి మృతి
వికారాబాద్ జిల్లా యాలాల మండలం గంగాసాగర్ లో శుక్రవారం సాయంత్రం హనుమాన్ మందిర్ దగ్గర చిన్నారులు ఆడుకుంటున్నారు. అందులో ఒక చిన్నారికి ఏదో కుట్టిందని చిన్నారి ఇంట్లోవాళ్లకు చెప్తే వారు ఏదో అనుకుని ఉన్నారు. ఇంతలో దాహమేస్తోందని నీళ్లు తాగి అంతలోనే సృహ కోల్పోతే అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారు బయట వెతికితే పాము కనపడింది. దానిని చంపి, పాము కాటు కూ గురై మృతి చెందిందని తెలిపారు.