స్కూటర్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు.. ప్రాణాలు కోల్పోయిన యువతి (వీడియో)
కేరళలోని కొల్లాం జిల్లా మైనాగపల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. అజ్మల్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారును ఆదివారం సాయంత్రం వేగంగా నడిపాడు. అతడి కారు స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు మహిళలపైకి దూసుకెళ్లింది. స్కూటర్‌ను ఢీకొట్టాక, కారు కింద పడిన యువతిని చాలా దూరం నిర్దాక్షిణ్యంగా అజ్మల్ ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నిందితుడు అజ్మల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.