
CT-25: ఇంగ్లాండ్ భారీ స్కోర్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్లో వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లకు 351/8 స్కోర్ చేసింది. ఓపెనర్ బెన్ డకెట్(166: 17 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో విరుచుకుపడగా, రూట్ అర్థసెంచరీ(68)తో ఆదుకున్నారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ 3, లబుషేన్ 2, జంపా 2 వికెట్లు పడగొట్టారు.