మణిపూర్‌లో మళ్లీ హింస.. ఎస్పీ కార్యాలయంపై దాడి (వీడియో)

69చూసినవారు
మణిపూర్‌లో మరోకసారి హింస చెలరేగింది. కాంగ్‌పోక్‌పీలో ఎస్పీ కార్యాలయంపై కుకీ ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్పీ సహా పలువురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా దళాలు ఇటీవల భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. దాన్ని వ్యతిరేకిస్తూ పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో కొందరు మహిళలపై భద్రతా దళాలు లాఠీఛార్జీ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.

సంబంధిత పోస్ట్