పపువా న్యూ గినియాలో హింస.. 53 మంది హత్య

64చూసినవారు
పపువా న్యూ గినియాలో హింస.. 53 మంది హత్య
పపువా న్యూ గినియా దేశంలో గిరిజన తెగల మధ్య ఆదివారం జరిగిన హింసాకాండ ఘోర విషాదాన్ని మిగిల్చింది. కనీసం 53 మంది వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఆ దేశంలోని రిమోట్ హైలాండ్స్‌ ఎంగా ప్రావిన్స్‌లో ఈ హింసాకాండ జరిగింది. అడవుల్లోకి చాలా మంది క్షతగాత్రులు పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. రోడ్లు, నదీ తీరాల్లో పడి ఉన్న మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్