బ్రిటన్ హింసతో అట్టుడుకుతోంది. ముగ్గురు బ్రిటన్ జాతీయులైన బాలికలపై కత్తిపోట్ల దాడి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దీంతో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా అక్కడి యూకే వాసులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ హింసాత్మకంగా ఘటనల నేపథ్యంలో భారత్ మంగళవారం సూచనలు చేసింది. లండన్‌లోని భారత హైకమిషన్ “పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారతదేశం నుండి వచ్చే సందర్శకులు UKలో అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించబడింది” ఎక్స్‌లో పేర్కొంది.