Viral Video: కారులో సింహాన్ని చూసి ఖంగుతిన్న పిల్లి

63చూసినవారు
మనుషుల తరహాలోనే జంతువుల మధ్య కూడా కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఓ కారులోని వెనుక సీటులో సింహం కూర్చొని వెళ్తుంది. అదే సమయంలో మరో కారులో ముందు వైపు ఓ పిల్లి కూర్చుని ఉంది. అయితే, కారులో ఉన్న సింహాన్ని చూసి పిల్లి ఖంగుతింది. చివరకు సింహం ఎక్స్‌ప్రెషన్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్