టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక పన్ను చెల్లించిన భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా జాబితా ప్రకారం.. విరాట్ కోహ్లి రూ.66 కోట్ల పన్ను చెల్లించాడు. ఆ తర్వాత స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోనీ (రూ.38 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ.28 కోట్లు), సౌరవ్ గంగూలీ (రూ.23 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ.13 కోట్లు), రిషబ్ పంత్ (రూ.10 కోట్లు) ఉన్నారు.