విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత

542చూసినవారు
విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత
AP: వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలులో పెట్రోల్‌ దాడికి గురై మృతి చెందిన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బుధవారం విద్యార్థిని తల్లితో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశారని, కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్