యూపీలోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని నాలడ్జ్ పార్క్-3 సమీపంలో గల గర్ల్స్ హాస్టల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన యువతులు బాల్కనీలో నుంచి దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం.