TG: నాగుపాము పూజగదిలోకి చేరి దేవుడి ఫొటో వద్ద పడగవిప్పిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్లలో జరిగింది. స్థానికుడు చెవుల కుమారస్వామి ఇంట్లో సోమవారం ఉదయం దేవుడి ఫొటోల మధ్యలో నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సుమారు మూడు గంటలపాటు పాము అక్కడే ఉందని వారు తెలిపారు. చివరికి అది బయటికి వెళ్లిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.