మేఘాలయలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సోమవారం సాయంత్రం భూకంపం సంభవించింది. వెడల్పు : 25.30, పొడవు : 91.71, 46 Km కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు స్థానిక మీడియా సంస్థ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.