నటి నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2011 లో సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నాని తెలిపారు. అప్పట్లో నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభు దేవ ప్రేమ కోసం తన నటనా జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు నయనతార వెల్లడించింది. “ గతంలో నా జీవితంలో ప్రేమ కావాలంటే, నేను కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని నేను భావించే దశలో ఉన్నాను. ప్రేమ కావాలంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాల్సిందేనని" ఆమె పేర్కొన్నారు.