వనపర్తి
వనపర్తి: ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్
వనపర్తి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలోని యూపీహెచ్సిలో హృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల గుండె వ్యాధుల వైద్య శిబిరాన్ని శనివారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో '0' నుండి 16 సంవత్సరాల పిల్లలకు గుండె కు సంబంధించిన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అవసరమైన వారికి 2డి-ఈకో పరీక్షలను చేశారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ జయచంద్ర మోహన్, అధికారులు, పాల్గొన్నారు.