వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ మహిళ.. తన సొంత సోదరుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సూసైడ్ నోట్‌ను గుర్తించిన బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య... బావమరిదిని ఇంట్లో చూడకూడని స్థితిలో తన కొడుకు చూశాడని ఆ లేఖలో ఉంది. సోదరుడితో సంబంధం వల్లనే ఆమెకు గతంలో 4 సార్లు విడాకులు కాగా, సదరు మహిళకు ఐదో పెళ్లి అని సమాచారం.