స్ట్రీట్ ఫైటర్ కావాలా? రియల్ ఫైటరా?: ఈటల

52చూసినవారు
స్ట్రీట్ ఫైటర్ కావాలా? రియల్ ఫైటరా?: ఈటల
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆ పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్ర చీఫ్ గా ఫైటర్ కావాలంటున్నారు. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటరా? రియల్ ఫైటరా? ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడా. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి. వీధుల్లో పోరాడేవారు కాదు' అని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్ష రేసులో రాజా సింగ్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్