బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా బాలకృష్ణ ప్రత్యేకత చాటుకున్నారని చిరంజీవి అన్నారు. తాను ఇంద్ర సినిమా చేయడానికి సమరసింహారెడ్డి సినిమా ఆదర్శమని తెలిపారు. తనకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని కోరిక ఉందని చిరు అన్నారు. తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరని, తామంతా ఒక కుటుంబం లాంటివాళ్లమని అన్నారు.