బోర్ల గూడెం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలి

67చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలంలో ఉన్న బోర్లగూడెంను మండలంగా ఆవిర్భావం చేయాలని ఆ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బోర్ల గూడెం చుట్టుపక్కల 12 పంచాయితీలు, 15 శివారు గ్రామాలు, నాలుగు ఎంపీటీసీ స్థానాలు దీని పరిధిలోకి వస్తాయి. 15 వేల మంది ఓటర్లు, 8 నుండి 10 వేల కుటుంబాలు, 30 వేల వరకూ జనాభా ఉన్న బోర్లగూడెం ప్రాంత అభ్యున్నతి కోసం అధికారులు నూతన మండలంగా ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్