భూపాలపల్లి జిల్లా కమలాపూర్- పెద్దాపూర్ అటవీ ప్రాంతంలో రాత్రి అటవీ ప్రాంతాన్ని పోడు చేస్తున్నారని సమాచారం, మేరకు అటవీ శాఖ భూపాలపల్లి రేంజ్ అధికారి నరేష్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. చెల్పూర్ బేస్ క్యాంప్ సిబ్బంది సురేష్ పై దాడి చేయగా తీవ్ర గాయాలు అవ్వడంతో సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతంలో మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.