కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు గోశాల గోమాతలకు భూపాలపల్లికి చెందిన తిప్పర్తి సురేష్ కుమార్ రెడ్డి నివేదిత దంపతులు శుక్రవారం దానా బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా మొదట అర్చకులు జూలపల్లి నాగరాజు వారిచే గణపేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.