జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల లోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపి అసోసియేషన్ గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు రెండు క్యారం బోర్డులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడుతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రానించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కుక్కడపు అశోక్, ప్రధాన కార్యదర్శి శనిగరం రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, వైద్యులు తిరుపతి రావు, ఎండి అజీమ్, మదు, ఉపాధ్యాయులు మహేష్, కవిత పాల్గొన్నారు.