రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందరమ్మ ఇండ్లు మంజూరీ చేస్తామని చెప్పి మోసం చేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా వంచన దినాల్లో బాగంగా శనివారం భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఏడాది గడుస్తున్నా ఇంటి స్థలాలు, రూ. 5లక్షలు ఒక్కరికి మంజూరీ చేయలేదన్నారు.