జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదనీరు పెరుగుతుంది. ఆదివారం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి 5, 52, 600 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, అంతే స్థాయిలో 85 గేట్ల ద్వారా దిగువకు అధికారులు వదిలారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉభయ నదులు ఉగ్రరూపం దాల్చాయి. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో పుష్కర ఘాట్లను తాకుతూ 9. 790మీటర్ల మేర వరద నీరు ప్రవహిస్తున్నది.