ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

844చూసినవారు
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాంబారి సాయి కుమార్ సహకారంతో కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు మటికే సంతోష్, గ్రామ కమిటీ అద్యక్షుడు రగుసాల తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ సాయిని విజయ ముత్యం, PACS చైర్మన్ నడిపెళ్లి విజ్జన్ రావు, హింగే మహేందర్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్ రావు, మండల నాయకులు, అన్ని గ్రామల సర్పంచ్, ఎంపీటీసీ, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొని, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి, బాణా సంచా కాల్చి, సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మటికే సంతోష్ మాట్లాడుతూ. మహా నాయకుని యొక్క జన్మదిన వేడుకలు మన మండల కేంద్రంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషమని అన్నారు. గౌరవ ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, భూపాలపల్లిలో తిరుగులేని నేతగా ప్రజలందరికీ హృదయాల్లో చిరుస్తాయిగా ఉంటారని అన్నారు. ఆయన సేవలు పేద ప్రజలకు నిరంతరం కొనసాగాలని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టి , ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరుకున్నారు. అనంతరం మండల యూత్ అద్యక్షుడు పకిడే కిరణ్ హనుమాన్ మాల ధరించిన స్వాములకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బీక్ష ఏర్పాటు చేసి. హనుమంతుడు, సకల దేవుళ్ళ ఆశీస్సులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పైన ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎస్. రజిత రాజయ్య, ఎంపీటీసీ హమీద్, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్, సోషల్ మీడియా జిల్లా కో ఆర్డినేటర్ సామ్రాట్, మండల యూత్ ఉపాధ్యక్షుడు బైకని సదానందం, సీనియర్ నాయకులు బండి కిరణ్ గౌడ్, యువజన జిల్లా నాయకులు విష్ణు యాదవ్, సీనియర్ నాయకులు వంచనగిరి వీరేశం, నిమ్మల రాజు, నిమ్మల శంకర్, నరెడ్ల కుమార స్వామి, గ్రామ యూత్ కమిటీ అద్యక్షుడు నేరేళ్ళ బిక్షపతి, గండ్ర యువసేన మండల అధ్యక్షుడు సూదనబోయిన సుమన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్