మావోయిస్టు లేఖపై స్పందించిన కాటారం పోలీసులు

68చూసినవారు
భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టుల లేఖ పై కాటారం సబ్ డివిజన్ పోలీసులు బుధవారం స్పందించారు. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు దళిత బంధు పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆ వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. కాటారం సబ్ డివిజన్ పోలీసులు స్పందించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తి విచారణ జరిపి నిజా నిజాలను ప్రజలకు తెలియజేస్తామని కాటారం సిఐ నాగార్జున రావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్