భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్కిరణ్ ఖరే ఆదేశాలతో బుధవారం జిల్లాలో గుడుంబా స్థావరాలపై పోలీసు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2320 లీటర్ల బెల్లం పానకం ధ్వంసంతో పాటు, 124 లీటర్ల గుడుంబా పట్టుబడింది. 13 కేసులు నమోదు చేసి 18 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.