విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ రాహూల్

60చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహూల్ శర్మ అన్నారు. శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలో మధ్యాహ్న భోజనం కోసం వండిన వంటకాలను పరిశీలించారు. స్టోర్ రూమ్, డార్మెటరీ హాల్ లను తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందిస్తున్న ఆహార పదార్థాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్