మాజీ జడ్పిటిసి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా

54చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల మాజీ జడ్పీటీసీ గుడాల అరుణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ భూపాలపల్లిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆదివారం రాత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి జడ్పీటిసి అరుణను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి, ఎమ్మెల్యే ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్