భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సోమవారం రాత్రి రాంరెడ్డి తన ద్విచక్ర వాహనాన్ని తీసే క్రమంలో హ్యాండిల్ కు చుట్టుకున్న నాగుపాము ఒక్కసారిగా బుసకొట్టింది. ఆయన వెంటనే పరుగులు తీశారు. త్రుటిలో ప్రమాదం తప్పింది. గంట పాటు పాము బైక్పైనే ఉంది. ఎట్టకేలకు పామును పట్టుకొని అడవిలో వదిలేశారు. వాహనదారులు తమ వాహనాలను బయటకు తీసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు.