డోర్నకల్ మండలం ముల్కలపల్లి శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో రామ నామ జపం శనివారం నుండి మొదలై 24గంటలు ఆదివారం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఆలయంలో హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అని పటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆలయాన్ని పూలతో ముస్తాబు చేశారు. తెల్లవార్లు నిద్రలేకుండా పటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాంప్రసాద్, అయ్యప్ప స్వాములు, గ్రామ భక్తులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.