డోర్నకల్: ముందుగా పాఠశాలలో ఘనంగా శ్రీ రామానుజన్ జయంతి వేడుకలు

63చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం ముందుగా శ్రీ రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అతని చిత్ర పటానికి పూలను సమర్పించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ముగ్గులు, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. దీనితో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొని పండుగలా మారింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మధ్యానపు నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్