మహబూబాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మోదుగుల గూడెం పాఠశాల విద్యార్ధిని అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి కి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు సత్య నారాయణ చారి, మరియు ఫిజికల్ డైరెక్టర్ దార్ల. సునీల్ సోమవారం తెలిపారు. ఎంపికైన విద్యార్ధిని జడ్పీహెచ్ఎస్ కేసముద్రం నందు జరుగు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు.