డోర్నకల్ నియోజకవర్గం కురవి మండల కేంద్రంలో కురవి మండల ఎంపిపి గుగులోత్ పద్మావతి మాట్లాడుతూ వర్షాకాలం మొదలు అయింది, ఈ కాలంలో చెరువులు, కుంటలు నిండి అలుగులు పొసే కాలం, వాగులు, వంకలు పొంగి పొర్లుతాయి,సెలవులు ఉన్నాయి కదా అని విద్యార్థులు, పిల్లలు సరదా కోసం ఈతకు, వాగులలో, కుంటలలో చేపలు పట్టడానికి వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఎంతో కష్టపడి పెంచిపోషించిన పిల్లలు కండ్ల ముందు కానరాని లోకాలకు వెళ్ళిపోతే ఆ బాధ అంత ఇంత కాదు, ఏ దేవుడు కూడా తీర్చలేడు. ఒకవేళ ఈత నేర్చుకోవాలంటే పెద్దవాళ్ళు ఉండి నేర్పండి, కానీ పిల్లలను ఒంటరిగా బయటికి వెళ్ళనీయకండి. అలుగులు పోస్తున్నాయని చేపలకు వెళ్ళనీయకండి. దయచేసి పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి పిల్లలను కాపాడుకోండి. పిల్లలు కూడా అనవసరంగా బయటికి వెళ్లి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చకండి అని ఎంపిపి అన్నారు.