దంతాలపల్లి అక్షర హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

75చూసినవారు
దంతాలపల్లి అక్షర హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
దంతాలపల్లి మండలంలోని స్థానిక అక్షర హైస్కూల్లో స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సింగారపు యాకయ్య మాట్లాడుతూ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం ఎంతో ఆదర్శవంతమైనదని వారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ దేశానికి ఎనలేని సేవలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తిరునగరి శ్రీధర్ కోఆర్డినేటర్స్ సుకన్య, పద్మ, నగీన, భవాని ఉపాధ్యాయులు అనిల్, సుజాత, స్వరూప, కావ్య, రమ, సైదమ్మ, అశోక్ రెడ్డి, అశోక్, నవ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్