మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం గ్రామంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు నూకల నరేశ్ రెడ్డి మరణాన్ని అధికారికంగా ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున ఆయన స్వగ్రామం పురుషోత్తమాయగూడెంకు మృతదేహం చేరుకుంది. ప్రజల సందర్శనార్థం శనివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలో ఉంచి అనంతరం అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు.