రెండవ విడత గొర్రెల పంపిణీ చేయాలని రహదారుల దిగ్బంధం

291చూసినవారు
రెండవ విడత గొర్రెల పంపిణీ చేయాలని రహదారుల దిగ్బంధం
ప్రభుత్వం వెంటనే గొల్ల కురుమలకు రెండవ విడత గొర్రెల పంపిణి చేయాలని డిమాండ్ చేస్తూ తొర్రూర్ సూర్యాపేట ప్రధాన రహదారిపై దంతాలపల్లి మండలం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (జిఎంపీఎస్) అధ్యక్షులు ఊడుగుల ఐలయ్య, ప్రధాన కార్యదర్శి  ఎర్ర బోయిన మురళి ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ గొల్ల కురుమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ మొదటి విడత సజావుగా పూర్తి చేసిందని అన్నారు. కానీ రెండో విడత పంపిణీ కోసం గొల్ల కురుమల నుండి 32500 రూపాయల చొప్పున డిడి లు తీయించుకొని రెండు సంవత్సరాలు గడిచిన ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వీరిని ఎస్ఐ భానోత్ వెంకన్న అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు బోర మల్లయ్య, వర్రే లింగయ్య, వీరబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్