బ్లేడ్ తో గొంతు కోసుకున్న వృద్ధుడు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గోపాల్పూర్ గ్రామంలో ఎల్లయ్య (80) అనే వృద్ధుడు సోమవారం బ్లేడ్ తో గొంతు కోసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఈఎన్టీ కర్ణాకర్ ప్రథమ చికిత్స అందించి ఎంజీఎం తరలించారు. గత వారం రోజులుగా ఆహారం తీసుకోవడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గొంతు ఎందుకు కోసుకున్నాడో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.