గీసుగొండ: దశ్రు తండాలో ఉపాధి గ్రామ సభ
గీసుగొండ మండలంలోని దశ్రు తండాలో బుధవారం ఉపాధి గ్రామ సభ నిర్వహించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం 2025-2026 నుండి చేయబోయే పనులను గ్రామసభలో ప్రజలకు, కూలీలకు వివరించారు. ఇంకా ఏమైనా వ్యక్తిగత పనులను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని మండల ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ శుష్మా, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, పంచాయతీ కార్యదర్శి సునీత, మేట్ లు, కూలీలు పాల్గొన్నారు.